స్థలం కబ్జాపై ఫిర్యాదు
ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి మండలంలోని నెహ్రునగర్ గ్రామంలో కోర్టు కేసు వున్న స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా గ్రామ పంచాయతీ పట్టించు కోవడం లేదని ఆరోపిస్తూ నిజామాబాద్ మున్సిపల్కార్పొరేటర్ అక్బర్ హుస్సేన్ శనివారం ఎడపల్లి తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై బోధన్ సబ్ కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు.
రెండో రోజు అమరణ నిరహార దీక్ష
కామారెడ్డి టౌన్, వెలుగు: పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఇండ్లు, భూమి ఇవ్వాలని కోరుతూ ధర్మ సమాజ్‌పార్టీ నాయకులు లక్ష్మణ్, రాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం రోజుకు చేరింది. తమ డిమాండ్లు నెరవేరే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. జిల్లా కన్వీనర్భోలేశ్వర్, కో కన్వీనర్ అరవింద్, ప్రతినిధులు గంగారాజు, రాజు, కవిన్, శివరామకృష్ణ, సత్యం, శ్యామ్, సుభాష్ పాల్గొన్నారు.
కాచాపూర్ వీరేశ్వర ఆలయ నూతన కమిటీ ఎన్నిక
భిక్కనూరు,వెలుగు: మండలంలోని కాయాపూర్ వీరేశ్వర ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు. శనివారం జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్‌స్పెక్టర్ కమల, భిక్కనూరు సిద్ధరామేశ్వర స్వయం భూలింగ ఆలయ ఈవో శ్రీధర్ కుమార్ సమక్షంలో నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.ఆలయ కమిటీ అధ్యక్షుడిగా స్వామి, కార్యదర్శిగా సిద్ధరాములు, పాలకవర్గ సభ్యులుగా వెంకటాచారి, బాలమణి, రమేశ్,శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తామని నూతన పాలకవర్గ సభ్యులు చెప్పారు.
అమిత్‌షా వ్యాఖ్యలను వక్రీకరించడం తగదు
ఆర్మూర్, వెలుగు: రాజ్యసభలో అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆర్మూర్ బీజేపీ నాయకులు మండిపడ్డారు. శనివారం ఆర్మూర్ లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, టౌన్ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, గిరిజన మోర్చా టౌన్ ప్రెసిడెంట్ పీర్ సింగ్ నాయక్ మాట్లాడారు. భారత రాజ్యాంగం, అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని అన్నారు.
అంబేద్కర్ కు బీజేపీ ప్రభుత్వం భారత రత్న బిరుదు ఇచ్చి గౌరవించిందన్నారు. రాజ్యాంగం, అంబేద్కర్ విషయంలో అవగాహనతో మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. బీజేవైఎం ఆర్మూర్ టౌన్ ప్రెసిడెంట్ కలిగోట ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, కార్యదర్శి రెడ్డబోయిన దక్షిణామూర్తి, దాసరి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రతన్‌టాటా జయంతి
నందిపేట, వెలుగు: భారత పారిశ్రామిక దిగ్గజం, సమాజ సేవకుడు దివంగత రతన్‌టాటా జయంతి వేడుకలను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఉద్యోగులు, అభిమానులు శనివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. రతన్‌టాటా తాను సంపాదించిన ప్రతీ రూపాయిలో రూ.64 పైసలు చారిటీల ద్వారా సేవా కార్యక్రమాలకు వెచ్చించేవారని కొనియాడారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు కృషి చేసిన సేవా మూర్తి అన్నారు. కార్యక్రమంలో టాటా లీడర్లు రవీందర్, మల్లేశ్, పవన్, మాధవ్, నవీన్, అనిల్ పాల్గొన్నారు.
షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తాం
బోధన్ , వెలుగు: సుభాశ్ పత్రీజీ కుటుంబ ఆశయ సాధన కోసం బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభిస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం హనుమాస్ పల్లి మహేశ్వర మహా పిరమిడ్ లో నిర్వహిస్తున్న పత్రీజీ ధ్యాన మహాయాగంలో ఆయన పాల్గొని ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రీజీ తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, ధ్యానం పేరుతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు.
పత్రీజీ తండ్రి షుగర్ ఫ్యాక్టరీలో పని చేస్తూ అనేక ఉత్పత్తుల తయారీకి కృషి చేశారని చెప్పారు. ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా కోట్లాది రూపాయలు వెచ్చించి పిరమిడ్ ను స్థాపించి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వారిని ధ్యాన మార్గంలో నడిపించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.