వివరాలు పక్కాగా ఉండాలి
జనగామ అర్బన్, వెలుగు : ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ దరఖాస్తుదారుల వివరాలు పక్కాగా ఉండాలని, బతుకమ్మ కుంట అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని జనగామ అడిషనల్కలెక్టర్పింకేశ్కుమార్ అన్నారు. బుధవారం జిల్లాలోని వెంకిర్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం నర్సరీ, స్థానిక బతుకమ్మ కుంటను సందర్శించారు. బతుకమ్మ కుంట అభివృద్ధికి ప్రతిపాదనలు సమర్పించాలని మున్సిపల్ఏఈని ఆదేశించారు. మున్సిపల్చైర్పర్సన్ పోకల జమున తదితరులున్నారు.
విచారణకు హాజరు కావాలి
జనగామ అర్బన్, వెలుగు : ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ హనుమకొండలో బహిరంగ విచారణ చేయనుంది. ఉమ్మడి వరంగల్ఎస్సీ కులాల సంఘ నాయకులు హనుమ కొండ కలెక్టరేట్లో విచారణకు హాజరై వినతులు ఇవ్వాలని షెడ్యూల్డ్ కులాల సంఘాలకు అధికారులు సూచించారు. ఈ విచారణ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది.
బాధిత కుటుంబానికి పరామర్శ
పర్వతగిరి, వెలుగు : వరంగల్జిల్లా పర్వతగిరి మండలం గోపనపెల్లిలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను జిల్లా కిసాన్సెల్కాంగ్రెస్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్రావు బుధవారం పరామర్శించారు. బాద నరసింగరావు, అనపర్తి కొమ్మాలు కుటుంబాలను పరామర్శించి, నాంపల్లి దువ్వయ్య మృతి చెందగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన
జనగామ అర్బన్, వెలుగు : సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరింది. సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరి రమేశ్మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చాలని జనగామ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు టీ స్టాల్ఏర్పాటు చేసి కలెక్టరేట్వద్ద ప్రజలందరికీ టీ పోస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
నల్లబెల్లి, వెలుగు : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన వరంగల్జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రఘుసాల హన్మంత్ పొలం పనికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో తాళం విరగ్గొట్టి బీరువాలోని డబ్బులను పట్టుకెళ్తుండగా గ్రామస్తులు చూసి పట్టుకున్నారు. నల్లబెల్లి పోలీసులకు అప్పగించడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ చేసిన వ్యక్తి నర్సంపేట మండలం ఇటుకాలపల్లికి చెందిన వాడిగా గుర్తించామని పోలీసులు తెలిపారు.