
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు వెంటనే పిల్లల్ని కనాలని చెప్పారు.వీలైతే ఒక్కో జంట ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తమిళనాడు యువ జంటలకు పిలుపునిచ్చారు. వారికి తమిళ పేర్లు పెట్టాలని అన్నారు.
డీలిమిటేషన్ ఆధార్ పార్లమెంటర్ నియోజకవర్గాల విభజన జరగొచ్చని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్న క్రమంలో సీఎం ఎంకే స్టాలిన్ ఇలా చేస్తే రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుందని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రకటన చేసిన ఒకరోజు తర్వాత స్టాలిన్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read :- తండ్రి అంత్యక్రియలకు వెళ్లినందుకు కొడుకును వెలేశారు !
నాగపట్నంలో జరిగిన ఓ సామూహిక వివాహ కార్యక్రమంలో స్టాలిన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫ్యామిలి ప్లానింగ్ పై ఫోకస్ చేశాం.. ఇప్పుడు అవసరం లేదని అన్నా రు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.