ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది.. సంబరాలు చేసుకుంటుంది.. అయితే గెలిచిన కప్ పై ఏ మాత్రం గౌరవం లేదు.. గెలుపు అహంకారమో.. బలుపో ఏమో.. వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టి తీవ్రంగా అవమానించారు. కప్ గెలిచిన తర్వాత.. కప్ తో పాటు హోటల్ గదులకు వెళ్లిన ఆటగాళ్లు మందు పార్టీ చేసుకున్నారు. అంత వరకు ఓకే.. కాకపోతే సోఫాలో కూర్చుని చేతిలో బీరు బాటిల్ తో ఉన్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్.. వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Mitchell Marsh with the World Cup. pic.twitter.com/n2oViCDgna
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 20, 2023
ఎంత అహంకారం.. ఎంత బలుపు అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కనీసం కప్ కు గౌరవం ఇవ్వాలి కదా.. ఇంత బరితెగింపా.. కప్ అంటే ఇంత చులకనా అంటూ తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఆరోసారి కప్ గెలిచాక ఆసీస్ తన బుద్ది చూపించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2006లో ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకునే టైమ్ లో బీసీసీఐ ప్రెసిడెంట్ తో ఆసీస్ అమర్యాదగా ప్రవర్తి్ంచడం ఇంకా గుర్తునే ఉంది.
Have some respect for the world cup man ??????????
— Esha Srivastav??? (@EshaSanju15) November 20, 2023
Look how God of cricket ? respects the coveted trophy. pic.twitter.com/wu8I9IwhA5
ఇప్పుడు తాజాగా వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి బీర్ తాగి అవమానించారు. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పటి ఫోటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. కప్ కు ఎంత గౌరవిస్తున్నారో చూసి నేర్చుకొండని చెప్తున్నారు. అసలు మీరు వరల్డ్ కప్ ఆడటానికి కూడా అనర్హులని... ఐసీసీ క్రికెట్ ఆస్ట్రేలియాపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా 50 ఓవర్లలో 240 రన్స్‌కే ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (66), విరాట్ కోహ్లీ (54), రోహిత్ శర్మ (47) రాణించినా మిగతా బ్యాటర్లు నిరాశ పరచడంతో ఆతిథ్య జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. చేజింగ్‌లో ట్రావిస్ హెడ్ (137) సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 43 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హెడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవగా.. విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కింది..