వీడియో: ముందెన్నడూ చూడని సూర్యుడి ఫొటోలు విడుదలచేసిన శాస్త్రవేత్తలు

వీడియో: ముందెన్నడూ చూడని సూర్యుడి ఫొటోలు విడుదలచేసిన శాస్త్రవేత్తలు

ఇంతకుముందెన్నడూ చూడని సూర్యుని చిత్రాలను నేషనల్ సైన్స్ ఫౌండేషన్ విడుదల చేసింది. ఈ చిత్రాలను అతిపెద్ద సౌర టెలిస్కోప్ డేనియల్ కె. ఇనోయ్ సోలార్ టెలిస్కోప్‌ను ఉపయోగించి తీశారు. ఈ ఫొటోలను శాస్త్రవేత్తలు జనవరి 29, 2020 న విడుదల చేశారు. ఈ చిత్రాలను చూస్తే.. సూర్యుడి ఉపరితలంపై టెక్సాస్ రోలింగ్ పరిమాణంలో ఉండే సెల్ లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ చిత్రాలు పాదముద్రలను పోలి ఉన్నాయి. సూర్యునిపై జరిగే సౌర విస్ఫోటనాలు భూమిని ప్రభావితం చేస్తాయి. అటువంటి విస్పోటనాల వల్ల విమాన ప్రయాణానికి అంతరాయం కలుగుతుంది. నావిగేషన్ కోసం ఉపయోగించే GPSను ఇవి నిలిపివేస్తాయి.

గెలీలియో కాలం నుండి ఇప్పటివరకు భూమి నుండి సూర్యుడిని అధ్యయనం చేయడంలో ఇది గొప్ప విజయమని ప్రొఫెసర్ జెఫ్ కుహ్న్ అన్నారు. IFA శాస్త్రవేత్తల బృందం రెండు సంక్లిష్టమైన పరికరాలను సృష్టించింది. మొదటిదాన్ని క్రయోజెనిక్ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోపోలారిమీటర్ అంటారు. ఇది సూర్యుడు మరియు సౌర తుఫానుల యొక్క అయస్కాంత కార్యకలాపాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఇక రెండవది.. డిఫ్రాక్షన్ లిమిటెడ్ నియర్ ఐఆర్ స్పెక్ట్రోపోలారిమీటర్. సూర్యుని యొక్క అయస్కాంత క్షేత్రాల పరిణామాన్ని చూడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ రెండు పరికరాలను ఉపయోగించి సూర్యుడు మరియు భూమికి మధ్య ఉన్న సంబంధాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కుహ్న్ తెలిపారు.

For More News..

మేకలమ్మితే రూ. 1.32 కోట్లు

కొన్నది 25 వేలకి.. అమ్మితే వచ్చేది 5 కోట్లు

ఇప్పుడు కండక్టర్‌.. రేపు కలెక్టర్‌..