Aadhar Card: మీరు ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా?.. మళ్లీ ఇలా తిరిగి పొందండి 

Aadhar Card: మీరు ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా?.. మళ్లీ ఇలా తిరిగి పొందండి 

ఆధార్ కార్డు.. భార‌త దేశంలో నివ‌సించే ప్రతి ఒక్కరికి గుర్తింపు కోసం ప్రభుత్వం Aadhaar Cardల‌ను జారీ చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. 12 అంకెల నంబర్ గల ఈ గుర్తింపు కార్డు ఒక ఆస్తి పత్రంలా మారింది. ఆధార్ లేనిది ఏ పని జరగదంటే నమ్మాలి. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, ప్రభుత్వ పథకాలు అందాలన్నా, ఆఖరికి పిల్లాడిని బడిలో చేర్పించాలన్నా ఆధార్ ఉండాల్సిందే. అయితే, కొన్ని సంధర్భాల్లో Aadhaar Card  పోగొట్టుకుపోతే మ‌ళ్లీ తిరిగి పొంద‌డం ఎలా అని చాలా మంది ఆందోళ‌న‌కు గుర‌వుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ కథనం. 

ఒక‌సారి ఆధార్ పొందిన త‌ర్వాత అది పోగొట్టుకున్నా చింతించాల్సిన పని లేదు. యూఐడీఏఐ(UIDAI) అధికారిక వెబ్‌సైట్ నుంచి మ‌ళ్లీ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఎలా అనేది తెలుసుకొని తిరిగి పొందండి. 

Aadhaar Card డౌన్‌లోడ్ చేసే విధానం

  • ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌(https://uidai.gov.in)ను సందర్శించాలి.
  • UIDAI వెబ్‌సైట్‌లోకి ఎంట‌రయ్యాక పైవైపు కనిపించే "మై ఆధార్‌(My Aadhar)" సెక్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కొన్ని ఆప్షన్‌లు క‌నిపిస్తాయి. వాటిలో Get Aadhaar అనే కేటగిరీలోని 'డౌన్‌లోడ్ ఆధార్(Download Aadhaar)' అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
  • ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేయాలి. లాగిన్ విజ‌య‌వంతం అయ్యాక మీరు డౌన్‌లోడ్ ఆధార్ కార్డు ఆప్షన్ క్లిక్ చేస్తే మీ కార్డు ఓపెన్ అవుతుంది. 
  • అక్కడ మీరు డౌన్‌లోడ్ ఆధార్ కార్డు అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ కార్డును మీరు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఒకవేళ మీరు ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను లింక్ చేయకపోయినా, ఆధార్ కార్డు నెంబర్ మీ వద్ద లేకపోయినా ఖంగారు పడక్కర్లేదు. బయోమెట్రిక్ సమాచారం నిక్షిప్తమై ఉంటుంది కనుక ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సిబ్బంది సహాయంతో తిరిగి పొందవచ్చు. అందుకు మీరు వ్యక్తిగతంగా కేంద్రాన్ని సందర్శించి, సిబ్బంది అడిగిన తగిన సమాచారాన్ని అందించాలి.