గూగుల్ క్రోమ్​అప్​డేట్ చేశారా?

గూగుల్ క్రోమ్​అప్​డేట్ చేశారా?

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడే సెర్చ్ ఇంజిన్​ గూగుల్ క్రోమ్​... ఇల్లు, ఆఫీస్​లలో ఎక్కువగా వాడుతుంటారు. అయితే గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం ఒక హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే.. ఇప్పుడు వాడుతున్న గూగుల్​ క్రోమ్​ వెర్షన్​ని వెంటనే అప్​డేట్ చేయాలి. లేదంటే మీ డేటా ఈజీగా స్కామర్ల చేతికి చిక్కుతుంది అని. ఇండియన్​ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-–In) ప్రకారం, గూగుల్ క్రోమ్​లో అనుమానంగా ఉన్నవాటిని గుర్తించారు. 

అవి దాడి చేస్తే కంప్యూటర్ హ్యాకింగ్​కి గురయ్యే ప్రమాదం ఉంది. దాంతోపాటు ఒక కంప్యూటర్ లేదా నెట్​వర్క్ ట్రాఫిక్​తో నిండిపోవడం వల్ల పనితీరులో మార్పులొస్తాయి. దీన్నే డినైయల్ ఆఫ్​ సర్వీస్​ స్థితి (Dos) అంటారు. ఇలా జరిగితే రిమోట్ యాక్సెస్​ తీసుకుని, డేటాను మార్చడం, సెన్సిటివ్​ ఇన్​ఫర్మేషన్​ని బయటపెట్టడం వంటివి చేసే చాన్స్ ఉంది. ఈ ప్రాబ్లమ్​ రాకుండా ఉండాలంటే అప్​డేట్ చేయాల్సి ఉంటుంది. 

అదెలాగంటే.. క్రోమ్ బ్రౌజర్​లో ఇన్​స్టాల్ చేయడానికి రెడీగా అప్​డేట్లు ఉన్నాయో లేదో చూడాలి. అందుకోసం సెట్టింగ్స్​లో ‘హెల్ప్’ ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత అబౌట్​ గూగుల్ క్రోమ్ సెలక్ట్​ చేయాలి. ట్యాబ్​ ఓపెన్​ కాగానే డౌన్​లోడ్ లేదా ఇన్​స్టాల్ చేయడానికి రెడీగా ఉన్న అప్​డేట్​లు చూపిస్తుంది. అప్​డేట్ మీద ట్యాప్​ చేస్తే సరి.