హావెల్స్ బ్రాండ్ అంబాసిడ‌‌‌‌ర్ న‌‌‌‌య‌‌‌‌న‌‌‌‌తార‌‌‌‌

హావెల్స్ బ్రాండ్ అంబాసిడ‌‌‌‌ర్ న‌‌‌‌య‌‌‌‌న‌‌‌‌తార‌‌‌‌

హైదరాబాద్​, వెలుగు:  ఎలక్ట్రికల్ కంపెనీ హావెల్స్​ నయనతార, -విఘ్నేష్ శివన్ దంపతులను దక్షిణ భారత మార్కెట్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల దక్షిణాదిలో మరింత బలపడగలమని తెలిపింది. ఈ జంటకు ఉన్న పాపులారిటీ తమకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. 

వీరిద్దరూ కలసి నటించిన మొదటి యాడ్​తమదేనని హావెల్స్ ఇండియా సేల్స్ విభాగం ప్రెసిడెంట్ ప‌‌‌‌రాగ్ భ‌‌‌‌ట్నాగ‌‌‌‌ర్ చెప్పారు.  హావెల్స్​ ప్రీమియం ఫ్యాన్లు, చిన్న గృహోపకరణాలు, లైటింగ్ సొల్యూషన్స్, స్విచ్ లు, వాటర్ హీటర్లు, ఐఓటీ ఉత్పత్తులు, వైర్లు వంటివి అమ్ముతుంది.