యాదాద్రి జిల్లాలో రాళ్లవర్షం..భారీగా పంటనష్టం

యాదాద్రి జిల్లాలో రాళ్లవర్షం..భారీగా పంటనష్టం

యాదాద్రి భువనగిరి : అకాలంగా కురిసిన వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలంలో బుధవారం మధ్యాహ్నం రాళ్లవాన కురిసింది. 20 నిమిషాలపాటు కురిసిన కడగండ్ల వానకు రైతులు ఇబ్బందుల పాలయ్యారు. వరి, మామిడి తోటల రైతులు బాగా నష్టపోయారు. ఈదురు గాలులతో పాటు, రాళ్ల వాన రావడంతో మామిడి కాయలు నేల రాలాయి. కోతకొచ్చిన వరి పంట నాశనమైంది. ఉదయం నుంచి ఎండతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని.. రాళ్లవాన దంచికొట్టిందని తెలిపారు స్థానికులు.