వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాలకుర్తి మండలంలో కురిసిన వర్షంతో.. గుడెల గూడెం – దర్దపల్లి  గ్రామాల మధ్య రోడ్డుపై వాగు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. గ్రామస్థులు మోకాలు లోతు నిళ్ళలో నడవాల్సిన పరిస్థితి నెలకొంది.