గాయత్రి జోడీకి వరల్డ్ టూర్ ఫైనల్స్ బెర్తు

న్యూఢిల్లీ:  ఇండియా డబుల్స్ షట్లర్లు  పుల్లెల గాయత్రి– ట్రీసా జాలీ ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌‌‌‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది చివర్లో జరిగే టోర్నీకి ఇండియా నుంచి ఈ ఇద్దరు మాత్రమే అర్హత సాధించారు. మంగళవారం అప్‌‌‌‌డేట్‌‌‌‌ అయిన బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ ఆధారంగా విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో గాయత్రి జంటకు బెర్తు లభించింది. 

గతవారం  చైనా మాస్టర్స్ టోర్నీలో రెండో రౌండ్‌‌‌‌లో ఓడినప్పటికీ ఈ ఏడాది నిలకడగా ఆడిన ఈ జోడీ టాప్‌‌‌‌–8 ర్యాంక్‌‌‌‌ నిలబెట్టుకుంది. ఈ సీజన్‌‌‌‌లో అత్యుత్తమంగా సింగపూర్ ఓపెన్, మకావు ఓపెన్‌‌‌‌ టోర్నీల్లో గాయత్రి, ట్రీసా సెమీఫైనల్స్‌‌‌‌ చేరుకున్నారు. డిసెంబర్ 11 నుంచి 15 వరకు చైనాలోని హాంగ్జౌలో బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్ టూర్ ఫైనల్స్‌‌‌‌ జరుగుతాయి. కాగా ఈ టోర్నీలో  ఇండియా నుంచి పీవీ సింధు మాత్రమే విజేతగా (2018) నిలిచింది.