సుల్తాన్ బజార్ లో హవాలా డబ్బు పట్టివేత

సుల్తాన్ బజార్ లో హవాలా డబ్బు పట్టివేత

బషీర్ బాగ్, వెలుగు: సుల్తాన్ బజార్ పీఎస్​పరిధిలోని హనుమాన్ టెక్డీలో హవాలా డబ్బు పట్టుపడింది. పక్కా సమాచారంతో సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ తన సిబ్బందితో కలిసి శనివారం హనుమాన్ టెక్డీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. రాత్రి 7:30 గంటల సమయంలో రాయల్ ప్లాజా సమీపంలో నాంపల్లికి చెందిన సంజయ్ కుమార్ మహాంకారి, సుల్తాన్ బజార్ కు చెందిన భేమర్ భాయ్ దేవజీ రాజ్ పుత్, అర్జున్​ భాయ్ రాజ్ ఫుత్ అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ ను తీసుకెళ్తుండగా, వారిని ఆపి తనిఖీ చేశారు. బ్యాగ్ లో రూ. 6.69 లక్షల నగదు బయట పడింది. ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. 

నగదుతో పాటు మూడు మొబైల్ ఫోన్లు సీజ్ చేసి, తదుపరి విచారణ కోసం నగదును ఆయాకర్ భవన్ లోని ఇన్​కమ్​ట్యాక్స్​అడిషనల్ డైరెక్టర్ కు అప్పగించారు. తనిఖీల సందర్భంగా డబ్బులు తరలిస్తున్న వ్యక్తులు పోలీసులపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఏసీపీ చాకచక్యంగా వ్యవహరించి , ముగ్గురు వ్యక్తులను నిలువరించి డబ్బు సీజ్ చేశారు.