రాయల్ గా కారులో వచ్చి దోపిడీలు .. ఏపీకి చెందిన పాత నేరస్తుడు అరెస్ట్  

రాయల్ గా కారులో వచ్చి దోపిడీలు .. ఏపీకి చెందిన పాత నేరస్తుడు అరెస్ట్  

ఎల్​బీనగర్,వెలుగు:  రాయల్ గా కారులో వెళ్లి ఇండ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరు పాత నేరస్తుల్లో ఒకరిని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 23 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. ఎల్​బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపిన ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన షేక్  అజీజ్(38), అదే జిల్లా అమలాపురానికి చెందిన పాతివాడ లోవరాజు(30) పాత నేరస్తులు. ఇప్పటికే 50 చోరీల్లో నిందితులు. కాగా.. ఏపీలో ఉంటూ లగ్జరీ కారులో సిటీకి వచ్చి శివారు కాలనీల్లో రెక్కీ వేస్తారు. లాక్ చేసిన ఇండ్లను గుర్తించి చోరీలు చేస్తుంటారు. ఇలా హయత్ నగర్ పీఎస్ పరిధిలో  నెల రోజుల్లో 3,  నిజామాబాద్ లో 1,  ఏపీలో 8 చోరీలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ లు, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 

మంగళవారం ఉదయం పెద్ద అంబర్ పేట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా నిందితుడు అజీస్ పట్టుబడ్డాడు. లోవ రాజు పరారీలో ఉన్నాడు.  వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, హయత్ నగర్ ఇన్ స్పెక్టర్ రామకృష్ణ,ఎస్ఐ వెంకట్ రెడ్డి, కానిస్టేబుళ్లతో కలిసి కేసును చేధించగా డీసీపీ అభినందించారు.