WI vs BAN: సెంచరీతో విధ్వంసం.. మిథాలీ రాజ్ రికార్డ్ బ్రేక్ చేసిన మాథ్యూస్

WI vs BAN: సెంచరీతో విధ్వంసం.. మిథాలీ రాజ్ రికార్డ్ బ్రేక్ చేసిన మాథ్యూస్

వెస్టిండీస్ స్టార్ బ్యాటర్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన శైలిలో రెచ్చిపోతుంది. బంగ్లాదేశ్ తో ఆదివారం (జనవరి 19) జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో సెంచరీతో చెలరేగింది. 93 బంతుల్లోనే 104 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మాథ్యూస్ ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు ఉండడం విశేషం. ఆమె వన్డే కెరీర్ లో ఇది ఎనిమిదో సెంచరీ. ఈ సెంచరీతో మాథ్యూస్ టీమిండియా మహిళల ఆల్ టైం గ్రేటెస్ట్ బ్యాటర్ మిథాలీ రాజ్ రికార్డును బ్రేక్ చేసింది.

వన్డేల్లో మిథాలీ ఇప్పటివరకు 7 సెంచరీలు చేసింది. 8 సెంచరీలతో మిథాలీని దాటి మాథ్యూస్  టాప్ 10 లో నిలిచింది. అదే విధంగా వెస్టిండీస్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన స్టాఫనీ టేలర్ (7) రికార్డ్ బ్రేక్ చేసి టాప్ లో నిలిచింది. ఇప్పటివరకు మహిళా వన్డే చరిత్రలో ఓవరాల్ గా 15 సెంచరీలతో ఆస్ట్రేలియా బ్యాటర్ మెగ్ లానింగ్ టాప్ లో ఉంది. 10 సెంచరీలతో స్మృతి మందాన మూడో స్థానంలో కొనసాగుతుంది. మాథ్యూస్ తో పాటు ఓపెనర్ జోసెఫ్ కూడా రాణించడంతో బంగ్లాదేశ్ పై జరిగిన తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. 

Also Read :- జట్టుతో కలిసిన భారత స్పీడ్ గన్.. ఇక ఇంగ్లీష్ బ్యాటర్లకు చుక్కలే

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఖాతూన్(40), అక్తర్(42) మాత్రమే బ్యాటింగ్ లో పర్వాలేదనిపించారు. వెస్టిండీస్ బౌలర్లలో డాటిన్ మూడు వికెట్లు తీసుకొని రాణించింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 34.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి మ్యాచ్ గెలిచింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్(104) సెంచరీతో రాణించగా..  జోసెఫ్(70) హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడింది.