మత సామరస్యానికి ప్రతీక అన్నారం దర్గా

  • ఈనెల 16 నుంచి ఉర్సు  ప్రారంభం
  • ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి


పర్వతగిరి, వెలుగు: వరంగల్​​జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్​ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. హజ్రత్​ సయ్యద్​ యాకూబ్​షావళి దర్గా ఉర్సు ఏటా మూడు రోజులపాటు నిర్వహించనుండగా, ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నది. వక్ఫ్​బోర్డు ఆధ్వర్యంలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. 16న గంధం, 17న దీపారాధన, అన్నదానం, 18న ఖతుముల్​ ఖురాన్​తో ఉత్సవాలు ముగుస్తాయి. అన్నారంలో యాకూబ్​బాబా దర్గాతోపాటు గౌష్​పాక్, మహాబూబీమా, బోలేషావాళి, గుంషావళి దర్గాలున్నాయి. ఆయా దర్గాల వద్ద కూడా భక్తులు ఉత్సవాలు జరుపుతారు. ఈ వేడుకలకు వచ్చే భక్తుల కోసం వరంగల్, హనుమకొండ, తొర్రూరు, నర్సంపేట, ఖమ్మంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ​

16  నుంచి ఉత్సవాలు

ఈనెల 16  నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉర్సుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. ఏర్పాట్ల కోసం వక్ఫ్​బోర్డు నుంచి రూ. 8.50 లక్షలు మంజూరయ్యాయి. ఉత్సవాల ప్రారంభోత్సవానికి  వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు, స్టేట్​ వక్ఫ్​బోర్డు నుంచి హాజరవుతున్నారు.- రియాజ్ పాషా, వక్ఫ్​ బోర్డు ఇన్​స్పెక్టర్​