సికింద్రాబాద్‌‌‌‌ లో వాజ్‌‌‌‌పేయి విగ్రహం ఏర్పాటుకు లైన్ క్లియర్

సికింద్రాబాద్‌‌‌‌ లో  వాజ్‌‌‌‌పేయి విగ్రహం ఏర్పాటుకు లైన్ క్లియర్

సికింద్రాబాద్‌‌‌‌ కంట్మోనెంట్‌లోని పబ్లిక్‌‌‌‌ గార్డెన్‌‌‌‌లో మాజీ ప్రధాని వాజ్‌‌‌‌పేయి విగ్రహం ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. పార్కులో విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త జె.ఉమేశ్వరరావు దాఖలైన పిల్‌‌‌‌ను బుధవారం హైకోర్టు కొట్టివేసింది. పికెట్‌‌‌‌ పబ్లిక్‌‌‌‌ గార్డెన్‌‌‌‌లోని విగ్రహాల ఏర్పాటుకు అక్రమ నిర్మాణాలను తొలగించాలని, వాజ్‌‌‌‌పేయి స్మారక విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ సుజయ్‌‌‌‌ పాల్, జస్టిస్‌‌‌‌ రేణుక యారాల బెంచ్‌‌‌‌ విచారణ చేపట్టంది. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. కేంద్రం వర్సెస్‌‌‌‌ గుజరాత్‌‌‌‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. 

Also Read : నోటిఫికేషన్ లోని నిబంధలనకు సడలింపులకు వీల్లేదు

కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ నరసింహశర్మ వాదిస్తూ.. దేశానికి అంతర్జాతీయంగా ప్రతిష్టలు తెచ్చిన మాజీ ప్రధాని వాజ్‌‌‌‌పేయి విగ్రహం ఏర్పాటుకు 2022లో అనుమతి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధంకాదని తెలిపారు. వాదనలు విన్న కోర్టు.. వాజ్‌‌‌‌పేయి విగ్రహం ఏర్పాటులో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ పిల్‌‌‌‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది.