టిఫిన్ బాక్సులో నాన్ వెజ్ .. విద్యార్థులను బహిష్కరించిన స్కూల్..హైకోర్టు కీలక తీర్పు

 టిఫిన్ బాక్సులో నాన్ వెజ్ .. విద్యార్థులను బహిష్కరించిన స్కూల్..హైకోర్టు కీలక తీర్పు

 టిఫిన్ బాక్సులో నాన్ వెజ్ తీసుకొచ్చి స్కూల్ నుంచి బహిష్కరించిన ముగ్గురు విద్యార్థులకు  అలహాబాద్ హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది.  వారిని రెండు వారాల్లోగా వేరే పాఠశాలలో చేర్చేలా చూసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది.

 ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ అమ్రోహాలోని ఓ స్కూల్ ప్రిన్సిపాల్..   టిఫిన్ బాక్సుల్లో నాన్ వెజ్ తీసుకొచ్చారని  విద్యార్థులను స్కూల్ నుంచి బహిష్కరించారు. దీనిపై   విద్యార్థుల పేరెంట్స్  అలహాబాద్  హైకోర్టులో పిటిషన్ వేశారు.  విద్యార్థులను స్కూల్ నుంచి బహిష్కరించడం వల్ల వారి విద్యాహక్కు  దెబ్బతింటోందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.

విచారణ  సందర్భంగా సిద్ధార్థ్, ఎస్ సి శర్మలతో కూడిన ధర్మాసనం  ఈ పిల్లలను రెండు వారాల వ్యవధిలో సిబిఎస్‌ఇకి అనుబంధంగా ఉన్న ఇతర పాఠశాలల్లో చేర్పించాలని అమ్రోహా జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది.  జిల్లా మేజిస్ట్రేట్ అమ్రోహా ద్వారా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. లేని  పక్షంలో  తదుపరి తేదీన అతను వ్యక్తిగతంగా హాజరుకావాలని పేర్కొంది. తదుపరి విచారణను కోర్టు 2025  జనవరి  6 కు వాయిదా వేసింది.