1,200 మంది ఎంపీహెచ్‌‌‌‌‌‌‌‌ఏల నియామకాలు రద్దు : హైకోర్టు

1,200 మంది ఎంపీహెచ్‌‌‌‌‌‌‌‌ఏల నియామకాలు రద్దు : హైకోర్టు
  • కోర్టు తీర్పులకు విరుద్ధంగా 2012లో జీవో తెచ్చారు: హైకోర్టు
  • అర్హుల జాబితా రెడీ చేసి తిరిగి భర్తీ చేపట్టాలని తెలంగాణ, ఏపీకి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు : మల్టీపర్పస్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ (ఎంపీహెచ్‌‌‌‌‌‌‌‌ఎ) నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ – 2002 కింద నియమితులైనవాళ్లను హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల అనంతరం తొలగించాక  తిరిగి విధుల్లోకి తీసుకోవడం చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఒక్కసారి కోర్టులు నిర్ణయం వెలువరించిన తర్వాత అదే ఫైనల్​ అని,  దానికి విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమంటే కోర్టు తీర్పుల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. 

కోర్టు ఉత్తర్వులతో తొలగించిన 1,200 మందిని కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 1207 చట్ట విరుద్ధమంటూ తీర్పు వెలువరించింది. అలా తిరిగి తీసుకోవడం వల్ల మరిన్ని వివాదాలు తలెత్తాయని, జీవోను సమర్థించినట్లయితే ప్రభుత్వం చేసిన తప్పునే ఈ కోర్టు మళ్లీ చేసినట్లవుతుందని వ్యాఖ్యానించింది. 90 రోజుల్లో అర్హులతో జాబితా సిద్ధం చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌‌‌‌‌‌‌‌ సుజయ్‌‌‌‌‌‌‌‌పాల్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

దీర్ఘకాలంగా న్యాయ వివాదాలు

మల్టీపర్పస్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ (ఎంపీహెచ్‌‌‌‌‌‌‌‌ఎ) నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ 2002లో అర్హతకు సంబంధించిన వివాదం దీర్ఘకాలంగా కోర్టుల్లో  నడుస్తున్నది. మొదట నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో అర్హతలను సవాల్​ చేస్తూ ట్రైబ్యునల్, తర్వాత హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు తీర్పు వెలువరిస్తూ.. ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ,  డిప్లొమా ఇన్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ అర్హతగా పేర్కొంటూ ఆ మేరకు మెరిట్‌‌‌‌‌‌‌‌ జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది. దీన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో గతంలో అర్హతలేని 1,200 మందిని తొలగిస్తూ అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2012లో జీవో 273 జారీ చేసింది. 

అయితే.. బాధితుల విజ్ఞప్తి మేరకు వారిని మంత్రివర్గం  కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ పద్ధతిన తీసుకుంటూ 2013లో జీవో 1207 జారీ చేసింది. వీటిని సవాల్​ చేస్తూ పిటిషన్‌‌‌‌‌‌‌‌లు దాఖలు చేయగా ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్‌‌‌‌‌‌‌‌ జీవోను సమర్థించింది. ఈ నియామకాలు కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ పద్ధతిన జరిగాయని, దీనివల్ల మంజూరైన పోస్టుల్లో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ నియామకాలకు ఎలాంటి ఇబ్బందిలేదని పేర్కొంది. 1207 జీవోను సవాల్​ చేస్తూ, దానితోపాటు వీరికి సమాంతరంగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై మరికొన్ని పిటిషన్లు, వీరి నియామకం వల్ల 2002 నుంచి నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంపై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిపై విచారించిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

తొమ్మిదేండ్ల సర్వీసు అన్న ఒకే ఒక్క కారణం మీద ప్రభుత్వం పునర్నియామకం చేపట్టిందని..  అర్హతలకు సంబంధించి వివాదం కోర్టు తీర్పు ద్వారా స్థిరపడ్డాయని, వీటిని జీవో 1207 ద్వారా అస్థిరపరచరాదని పేర్కొంది. ఎలాంటి నియామక ప్రక్రియ లేకుండా దొడ్డిదారిన, ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా వచ్చారని వ్యాఖ్యానించింది. 

అర్హత లేనివారిని తొలగించాలని ఈ కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత అదే అంతిమమని స్పష్టం చేసింది. వీరిని తొలగించిన తర్వాత తిరిగి జీవో 1207 కింద సర్వీసుల్లోకి తీసుకోవడం చెల్లదంది. దీన్ని అనుమతిస్తే గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమవుతుందని పేర్కొంది. జీవో 1207కు చట్టబద్ధతలేదని, అర్హతలున్నవారితో జాబితా సిద్ధం చేయాలని, ఈ ప్రక్రియను 90 రోజుల్లో పూర్తి చేయాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ప్ఱభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.