సీఎం, సీఎం కూతురు ఇద్దరికీ హైకోర్టు నోటీసులు

సీఎం, సీఎం కూతురు ఇద్దరికీ హైకోర్టు నోటీసులు

CMRL-ఎక్సోలాజిక్ మంత్లీ పేమెంట్ కేసుకు సంబంధించి కేరళ సీఎం విజయన్, అతని కుమార్తె వీణా విజయన్ కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్ట్ MR అజయన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆధారంగా నోటీసులిచ్చింది.  ఈ పిటిషన్ ను ఇంకా కోర్టు ఫైల్ లోకి స్వీకరించనప్పటికీ అంతకుముందే కేసులో ప్రమేయం ఉన్న అన్ని పార్టీలకు నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది. ఇతర ప్రతివాదులుగా CMRL, EXalogic, Sashidharan Kartha, CMRL అధికారులను చేర్చింది. 

ఆదాయపు పన్ను శాఖ నివేదిక ఆధారంగా ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు జరపాలని అజయన్ పిటిషన్‌లో డిమాండ్ చేశారు. ఈ కేసులో విజిలెన్స్ దర్యాప్తు కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. ఆదాయపు పన్ను పరిష్కార బోర్డు నివేదికలో పేర్కొన్న పేర్లను సమర్పించాలని కూడా కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ కేసు వేసవి సెలవుల తర్వాత మే 27న మళ్లీ హైకోర్టు విచారించనుంది.

►ALSO READ | హిందూ బోర్డులలో ముస్లింలను అంగీకరిస్తారా..? కేంద్రానికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న