మహా అద్భుత కట్టడం రామప్ప టెంపుల్

మహా అద్భుత కట్టడం రామప్ప టెంపుల్
  • రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ సుజయ్ పాల్ 
  • కుటుంబసభ్యులతో ఆలయం సందర్శన

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : రామప్ప టెంపుల్ మహా అద్భుత కట్టడమని  హైకోర్టు జడ్జి జస్టిస్ సుజయ్ పాల్ పేర్కొన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ఆలయాన్ని ఆదివారం ఆయన కుటుంసభ్యులతో కలిసి సందర్శించారు. ముందుగా ములుగు ఎస్పీ శబరిశ్​ బొకే ఇచ్చి స్వాగతించగా.. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి సన్మానించి తీర్థప్రసాదాలు అందించి దీవించారు. అనంతరం గైడ్ ద్వారా టెంపుల్ విశిష్టతను తెలుసుకుని ఆయన మాట్లాడారు.

రామప్ప టెంపుల్ 800 ఏండ్ల కింద నీళ్లలో తేలే ఇటుకలతో శాండ్​ బాక్స్ టెక్నాలజీతో నిర్మించారని, గర్భగుడిలోని లైటింగ్ తో సహా ప్రతిది అత్యద్భుతంగా ఉందని కొనియాడారు.  అప్పట్లోనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందనడానికి ఆలయ నిర్మాణమే నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం రామప్ప లేక్ ను సందర్శించి, బోటింగ్ చేశారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి  సిహెచ్. పంచాక్షరి, ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ వీపీ సూర్య చంద్రకళ, హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి  సీహెచ్.

రమేష్ బాబు, వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి  బీవీ  నిర్మల గీతంబా, సీనియర్ సివిల్ జడ్జి టి. కన్నయ్య లాల్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె. సౌఖ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వినయ్ కుమార్, జనరల్ సెక్రటరీ కె. సునీల్ కుమార్, పోలీసు, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.