అజహారుద్దీన్ కి షాక్.. HCA ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు

అజహారుద్దీన్ కి షాక్.. HCA ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు

భారత మాజీ క్రికెటర్  మహ్మద్ అజారుద్దీన్‌ కి బిగ్ షాక్ ఇచ్చింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. HCA ఎన్నికల్లో పోటీ చేయకుండా  వేటు వేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరా రావు కమిటీ విచారం చేసి ఈ నిర్ణయం తీసుకుంది. అజహారుద్దీన్ HCA అధ్యక్షడిగా ఉంటూనే మరోవైపు  డక్కన్ బ్రూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షడిగా పని చేయడమే దీనికి కారణం. నిబంధనలం ప్రకారం ఇలా చేయడం కరెక్ట్ కాకపోవడంతో అజారుద్దీన్ కి ఊహించని షాక్ తగిలింది. 

కాగా.. గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ తొలగించిన సంగతి తెలిసిందే. అజారుద్దీన్‌పై పెండింగ్‌లో ఉన్న కేసులను పేర్కొంటూ అపెక్స్ కౌన్సిల్ అతడి సస్పెండ్ చేసింది. 27 సెప్టెంబర్ 2019న హెచ్‌సిఎ అధ్యక్షుడిగా ఎన్నికైన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. అపెక్స్ కౌన్సిల్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తోంది. ఈ ఫిర్యాదులపై విచారణ పూర్తయ్యే వరకు మీ హెచ్‌సిఎ సభ్యత్వం రద్దు చేయబడుతోంది" అని షోకేస్ నోటీసులో పేర్కొన్నారు.