క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి ల్యాండ్ ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డికి హెచ్‌‌‌‌సీఏ విజ్ఞప్తి

క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి ల్యాండ్ ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డికి హెచ్‌‌‌‌సీఏ విజ్ఞప్తి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో క్రికెట్‌‌‌‌ అభివృద్ధికి ప్రతి జిల్లాలో ఒక స్టేడియం నిర్మించాలని, ప్రస్తుత అవసరాల దృష్ట్యా హైదరాబాద్‌‌‌‌లోనూ మరో ఇంటర్నేషనల్ స్టేడియం కట్టేందుకు ప్రభుత్వ ధర ఆధారంగా భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని   హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (హెచ్‌‌‌‌సీఏ) కోరింది. ఈ మేరకు హెచ్‌‌‌‌సీఏ ట్రెజరర్‌‌‌‌‌‌‌‌ సీజే శ్రీనివాస్‌‌‌‌  సోమవారం సీఎం కార్యాలయంలో  రేవంత్‌‌‌‌ రెడ్డికి వినతిపత్రం అందించారు.

  హైదరాబాద్‌‌‌‌ పరిసరాల్లో  ప్రభుత్వ ధర ఆధారంగా 100–120 ఎకరాలు కేటాయిస్తే  లక్ష సీటింగ్‌‌‌‌ సామర్థ్యంతో అత్యాధునిక స్టేడియం, అందులో ఐదు ప్రాక్టీసు గ్రౌండ్లు, హైపెర్ఫామెన్స్‌‌‌‌ సెంటర్‌‌‌‌ నిర్మిస్తామని తెలిపారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్టు సీజే శ్రీనివాస్ చెప్పారు.  హైదరాబాద్‌‌‌‌తో పాటు ప్రతి ఉమ్మడి జిల్లాలో 25 ఎకరాల భూమి ఇస్తామని, మంచి స్టేడియాలు నిర్మించి యువ క్రికెటర్ల బంగారు భవిష్యత్‌‌‌‌కు బాటలు వేయాలని సీఎం రేవంత్‌‌‌‌ సూచించినట్టు తెలిపారు.  హెచ్‌‌‌‌సీఏ విజ్ఞప్తికి సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో హెచ్‌‌‌‌సీఏ ప్రెసిడెంట్‌‌‌‌ జగన్ మోహన్‌‌‌‌ రావు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.