టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌‌కు HCA రూ.10 లక్షల నజరానా

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌‌కు HCA రూ.10 లక్షల నజరానా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌కు ఫీల్డింగ్ కోచ్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన టి.దిలీప్, టీమ్ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేసిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. దేవరాజ్‌‌‌‌‌‌‌‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ) చెరో రూ.10 లక్షల నజరానా ప్రకటించింది. ఈ ఇద్దరినీ ఘనంగా సత్కరించాలని హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించినట్టు ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జగన్ మోహన్ రావు  గురువారం తెలిపారు. 

అయితే, హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ సెక్రటరీ అయిన దేవరాజ్‌‌‌‌‌‌‌‌ క్యాష్ రివార్డును సున్నితంగా తిరస్కరించారు. మరోవైపు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ)కు సంబంధించిన అంశాలను అర్థం చేసుకోవడం, పరిష్కరించడం కోసం బీసీసీఐ ఆదేశాల మేరకు ఏడుగురు సభ్యులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు జగన్ ప్రకటించారు.