ఇద్దరు హైదరాబాద్ క్రికెటర్లపై బ్యాన్

ఇద్దరు హైదరాబాద్ క్రికెటర్లపై బ్యాన్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇద్దరు ఆటగాళ్లపై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. మోసపూరిత పత్రాలు అందించినందుకు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. మహ్మద్ బాబిల్లేల్ (అండర్-19 ప్లేయర్) మరియు శశాంక్ మెహ్రోత్రా (హెచ్‌సిఎ రిజిస్టర్డ్ ప్లేయర్) జట్టుకు ఎంపిక సమయంలో మోసపూరిత పత్రాలను రూపొందించారు.

హెచ్‌సిఎ సిఇఒ సునీల్ కాంటే మాట్లాడుతూ, “ఎంక్వైరీలో, ఈ ఇద్దరు ఆటగాళ్లు దోషులుగా తేలింది. తదనంతరం, నిజాన్ని కనుగొన్న తర్వాత, మేము వారిని సంబంధిత బృందాల నుండి మినహాయించాము. సెలెక్టర్లు ఇద్దరు ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకున్నాం". అని    సునీల్ కాంటెన్ వెల్లడించాడు. మేము బలమైన వ్యవస్థను కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్నామని, క్లబ్బులు, కోచింగ్ సెంటర్లు ఈ విషయంలో అవగాహన కల్పించాలని తెలిపాడు. 

ఇదిలా ఉండగా.. నేడు (అక్టోబరు 9) న్యూజిలాండ్ తో నెదర్లాండ్స్,  అక్టోబర్ 10న పాకిస్తాన్ తో  శ్రీలంక జట్ల మధ్య జరిగే రెండు ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం గిరిజన, మైనారిటీ సంక్షేమ పాఠశాలల విద్యార్థులకు సుమారు 2000 టిక్కెట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచులు జరగనున్నాయి