ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపికైన తెలంగాణ క్రికెటర్లు జి.త్రిష, కె.ధ్రుతిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఘనంగా సన్మానించింది. శనివారం (28 డిసెంబర్, 2024) ఉప్పల్ స్టేడియంలో ఇద్దరినీ హెచ్‌సీఏ అధ్యక్షులు అరిశ్నపల్లి జగన్మోహన్రావు ప్రత్యేకంగా అభినందించారు.
ప్రతిష్ఠాత్మక వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నమెంట్‌కు ఇద్దరు తెలంగాణ క్రికెటర్లు ఎంపికవడం గర్వంగా ఉందని జగన్ మోహన్ రావు అన్నారు. వీరు ఈ స్థాయికి చేరుకోవడానికి వారి తల్లిదండ్రులు, కోచ్‌లు పడిన శ్రమ మాట్లాల్లో చెప్పలేనిదని తెలిపారు. వర్ధమాన క్రికెటర్లు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.
Also Read :- ఓయో రూమ్స్‌లో పేకాట రాయుళ్ల అరెస్టు
జాతీయ జట్టులో, డబ్ల్యూపీఎల్ (మహిళల ప్రీమియర్ లీగ్)లో మరింత మంది తెలంగాణ క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించేలా తమ కార్యవర్గం కృషి చేస్తుందని చెప్పారు. వరల్డ్‌కప్ తర్వాత ఈ ఇరువురు ప్లేయర్లకు నగదు బహుమతి ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యదర్శి దేవ్‌రాజ్, సహాయ కార్యదర్శి బసవరాజు, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్, ఐసీఏ సభ్యురాలు వంకా రోమ తదితరులు పాల్గొన్నారు.