యువ క్రికెటర్లకు శుభవార్త.. HCA ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

యువ క్రికెటర్లకు శుభవార్త.. HCA ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

మీరు క్రికెటర్లా..! ఉదయాన్నే లేచింది మొదలు బ్యాట్, బాల్‌తో కుస్తీ పడుతుంటారా..!..! అయితే మీకో సువర్ణావకాశం. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొని మంచిగా రాణించి.. మీ ఉజ్వల క్రీడా భవిష్యత్తుకు పునాదులు వేసుకోండి.

హెచ్ సీఏ ఆధ్వర్యంలో అండర్-16 ఇంటర్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ క్రికెట్ టోర్నమెంట్ 2024-25 నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలని తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలల నుండి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనే ఒక్కో జట్టుకు ప్రవేశ రుసుము రూ. 1000/గా నిర్ణయించారు. అనగా వెయ్యి రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మీ జట్టు పేరు రిజిస్టర్ చేసుకోవాలి.

Also Read :- అతని ప్రతిభ ధాటికి సచిన్, నేను సరిపోము

చివరి తేదీ జూలై 20

ఎంట్రీలను సమర్పించడానికి చివరి తేదీ జూలై 20, 2024గా నిర్ణయించారు. ఆసక్తి గల యువ క్రికెటర్లు సంబంధిత పాఠశాల లేదా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అభ్యర్థన లేఖతో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని హెచ్‌సిఎ కార్యాలయాన్ని సంధరించవచ్చు. సమయవేళలు.. ఉదయం 11:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకూ. ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రాతిపదికన ఎంట్రీలు ఆహ్వానిస్తున్నారు.

గమనిక: ఈ టోర్నమెంట్‌లో ఆడాలనుకునే యువ క్రికెటర్ల వయస్సు 1-9-2008 నుండి 31-08-2010 మధ్య ఉండాలి. గమనించగలరు. మరిన్ని పూర్తి వివరాల కొరకు HCA అధికారిక వెబ్‌సైట్ https://www.hycricket.org/ని సందర్శించగలరు.