జిల్లాకో మినీ క్రికెట్ స్టేడియం.. ప్రతి జిల్లాకు రూ. కోటి : HCA అధ్యక్షడు జగన్ మోహన్ రావు

జిల్లాకో మినీ క్రికెట్ స్టేడియం.. ప్రతి జిల్లాకు రూ. కోటి : HCA అధ్యక్షడు జగన్ మోహన్ రావు

క్రికెట్‌ అభివృద్ధికి   చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు.  ఉప్పల్‌ స్టేడియంలో జగన్‌మోహన్‌ రావు అధ్యక్షతన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌కు సిద్ధం..  ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధికి రూ.కోటి ఖర్చు చేయనున్నామని తెలిపారు.  ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక దగ్గర పది ఎకరాలు కొనుగోలు చేసి కొత్త స్టేడియాలను నిర్మిస్తామని చెప్పారు. అంతవరకు మైదానాలను లీజుకు తీసుకుని క్రికెట్‌ కార్యాకలాపాలు నిర్వహిస్తామన్నారు.

దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇటీవల సత్తా చాటిన తెలంగాణ క్రికెటర్లను సత్కరించేందుకు  మార్చిలో హెచ్‌సీఏ అవార్డ్సు వేడుక నిర్వహిస్తామన్నారు జగన్ మోహన్ రావు.   బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఉప్పల్‌ స్టేడియంను ఆధునీకరిస్తామని చెప్పారు.  మల్టీలెవల్‌ పార్కింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేస్తాం.. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు త్వరలో టెండర్లను పిలుస్తామన్నారు జగన్ మోహన్ రావు.