
హైదరాబాద్, వెలుగు : ఉప్పల్ స్టేడియంలో విద్యుత్ సరఫరా, పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో నెలకొన్న వివాదానికి తెరపడింది. 2015 నుంచి కొనసాగుతున్న ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూకీతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు చర్చించారు.
ఇందులో భాగంగా వాయిదా పద్ధతిలో బకాయిలను చెల్లిస్తామన్న తమ ప్రతిపాదనకు టీఎస్ఎస్‌పీడీసీఎల్ అంగీకరించిందని జగన్ మోహన్ తెలిపారు. దీంతో తొలి వాయిదా చెల్లిస్తామని చెప్పారు.