- సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌జగన్ మోహన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్రీడలు, క్రీడల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో చేసిన ప్రకటనపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో యువతను క్రీడలవైపు ప్రోత్సహించి అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ముచ్చర్లలో స్పోర్ట్స్ హబ్, అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ ఎ. జగన్ మోహన్ రావు అన్నారు.
ఇటీవల హెచ్‌సీఏ ఇటీవల హెచ్‌సీఏ చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకుని వంద ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ మైదానం నిర్మిస్తామని, జిల్లాల్లో క్రికెట్ మైదానాలు నిర్మిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్ర క్రికెటర్లు, క్రికెట్ అభిమానుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.