HCA Recruitment 2024: హెచ్‌సీఏలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి

మీరు క్రికెట్ ఔత్సాహికులా..! బ్యాట్, బాల్ అంటే అమితమైన ఇష్టమా..! ఇంకెందుకు ఆలస్యం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కోచ్ మొదలు ఫిజియోథెరఫిస్ట్, ట్రైనర్స్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ మేనేజర్, చీఫ్ క్యూరేటర్,  చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అకౌంట్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, క్రికెట్ ఆపరేషన్ అసిస్టెంట్స్ వంటి పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వీటిలో మీరు ఎందులో నిష్ణాత్తులో ఒక అభిప్రాయానికి వచ్చి.. ఆ విభాగంలో దరఖాస్తు చేసుకోండి.

ముఖ్య వివరాలు

విభాగాల వారీగా ఖాళీలు: కోచ్‌లు (మహిళలు, పురుషులు) ఫిజియోథెరఫిస్ట్, ట్రైనర్స్, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, హెడ్ అఫ్ క్రికెట్ ఆపరేషన్స్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ క్యూరేటర్, ఫైనాన్స్ మేనేజర్, అడ్మిన్, మేనేజర్, అకౌంట్స్ అసిస్టెంట్, క్రికెట్ ఆపరేషన్స్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్. 

  • క్రికెట్ కోచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం నేషనల్ క్రికెట్ లెవల్ 1 ఆడి ఉండాలి. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక, ఫిజియోథెరఫిస్టులు బ్యాచిలర్ డిగ్రీతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. ట్రైనర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ASCA లెవల్ 1 ఆడి ఉండాలి.

పై ఖాళీల భర్తీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.hycricket.org/careers/careers.html వెబ్ సైట్‌ని సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తుల(బయోడేటా)ను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు లేదా హెచ్‌సీఏ వారు పొందుపరిచిన hcaadmn.1934@gmail.com మెయిల్‌కు వివరాలను పంపవచ్చు.  

ALSO READ | హెచ్‌‌‌‌‌‌‌‌ఏఎల్‌‌‌‌‌‌‌‌లో నాన్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిక్యూటివ్స్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్

అభ్యర్థుల నుంచి పలు విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానించిన హెచ్‌సీఏ.. ఖాళీలు ఉన్నాయనేది పేర్కొనలేదు. అవసరాన్ని బట్టి ఖాళీలను భర్తీ చేస్తారు. కావున, కొన్ని ఖాళీలు మాత్రమే ఉంటాయి, దరఖాస్తు చేయడం అనవసరం.. అమ్మేసుకుంటారు అనే ఊహాగానాలకు తావివ్వకుండా.. దరఖాస్తు చేసుకోగలరని మనవి. 

పోస్టుల ఖాళీలు, అర్హతలు వంటి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ https://www.hycricket.org/careers/careers.html పై క్లిక్ చేయండి.