మేయర్ ను కలిసిన హెచ్ సీఏ సెక్రటరీ

మేయర్ ను కలిసిన హెచ్ సీఏ సెక్రటరీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) సెక్రటరీ ఆర్ దేవరాజ్ ఆదివారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావును బంజారాహిల్స్ లోని వారి నివాసంలో కలిశారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సంతకం చేసిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ –2025 టీమిండియా జెర్సీని అందజేశారు. టోర్నమెంట్ టైంలో దేవరాజ్ ఇండియా జట్టు మేనేజర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. 

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హెచ్ సీఏ  నిర్వహిస్తున్న ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను సజావుగా నిర్వహించేందుకు సహకరిస్తున్న  ప్రభుత్వానికి, మేయర్‌‌‌‌‌‌‌‌కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో కొత్త క్రికెట్ స్టేడియం కోసం భూమి కేటాయింపునకు జరుగుతున్న ప్రయత్నాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.