హైదరాబాద్, వెలుగు: చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా టీమ్ మేనేజర్‌గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఆర్. దేవ్‌రాజ్ ఎంపికయ్యారు. టీమ్ మేనేజర్‌గా తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి దేవ్‌రాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఐసీసీ టోర్నీలో పాల్గొనే టీమ్‌కు మేనేజర్‌గా సుదీర్ఘ విరామం తర్వాత హెచ్‌సీఏ ప్రతినిధికి అవకాశం రావడంపై సంఘం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. దేవ్‌రాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.