హైదరాబాద్, వెలుగు: మహిళా క్రికెటర్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తొలిసారిగా విమెన్స్ టీ10 లీగ్‌ను మొదలు పెట్టింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో ఈ లీగ్ లాంఛనంగా మొదలైంది. అండర్–-15లో 12 జట్లు, అండర్–-17లో 12 జట్లు, అండర్–-19లో ఆరు జట్లు ఈ లీగ్‌లో పోటీ పడనున్నాయి. 15 రోజుల పాటు జరగనున్న ఈ లీగ్‌లో సుమారు 450 మంది అమ్మాయిలు పాల్గొంటారు.
అన్ని మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగుతాయని, ప్రతి జట్టు కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఉప్పల్ స్టేడియంలో ఆడేలా షెడ్యూల్ చేసినట్టు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. యువ ప్రతిభావంతులను మిథాలీ రాజ్ వంటి దిగ్గజ క్రికెటర్లుగా తయారు చేయాలనే ఆశయంతో ఈ లీగ్‌కు రూపకల్పన చేశామన్నారు. భవిష్యత్తులో టీమిండియా, డబ్ల్యూపీఎల్‌కు తెలంగాణ అమ్మాయిలను ఆడించడమే తమ లక్ష్యమన్నారు.