హెచ్​సీఎల్​ టెక్​ సెంటర్​ షురూ

హెచ్​సీఎల్​ టెక్​ సెంటర్​ షురూ

హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ కంపెనీ హెచ్​సీఎల్ టెక్​ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా హైదరాబాద్‌‌‌‌లో కొత్త సెంటర్​ను ప్రారంభించింది. ఇది హైటెక్, లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి కంపెనీల గ్లోబల్​ క్లయింట్‌‌‌‌లకు అత్యాధునిక క్లౌడ్, ఏఐ  డిజిటల్ సొల్యూషన్లను అందిస్తుంది. 

హైటెక్ సిటీలోని ఈ ఆఫీసులో ఐదు వేల మంది కూర్చోవచ్చు. దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి గోల్డ్ సర్టిఫికేషన్‌‌‌‌ వచ్చిందని హెచ్​సీఎల్​ టెక్​ ప్రకటించింది.  2007 నుంచి హైదరాబాద్‌‌‌‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపింది. కొత్త దానితో కలుపుకుంటే హైదరాబాద్​లో తమ సెంటర్ల సంఖ్య హైదరాబాద్​లో ఐదుకు చేరిందని హెచ్​సీఎల్ ​టెక్ పేర్కొంది.