
న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ఫౌండర్ శివ్‌నాడార్ కంపెనీలోని తన వాటాలో 47 శాతాన్ని కూతురు రోషిణీ నాడార్ మల్హోత్రాకు కానుకగా ఇచ్చారు. వామా ఢిల్లీలోనూ వాటాలను అప్పగించారు. దీంతో ఆమె రెండు కంపెనీల్లో మెజారిటీ షేర్‌హోల్డర్ అయ్యారు. వీటిలో ఓటింగ్ హక్కులపైనా ఆమెకు నియంత్రణ దక్కుతుంది.
వామా ఢిల్లీకి హెచ్‌సీఎల్ టెక్‌లో ఉన్న 44.17 శాతం వాటా, హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌లోని 0.17 శాతం వాటా కూడా రోషిణికే చెందుతుంది.