మూడు రోజులు ఆఫీసుకు రాకపోతే.. వారం మొత్తం ఆప్సెంట్

మూడు రోజులు ఆఫీసుకు రాకపోతే.. వారం మొత్తం ఆప్సెంట్

ఇండియా ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైనా HCL తన ఉద్యోగులకు కొత్త నిబంధనలు  అమలు చేస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీ ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ కంపెనీ ఉద్యోగులు వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసు నుంచి పనిచేయాలని సూచించింది. నిబంధనలు పాటించని ఉద్యోగులు చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించింది. మూడురోజులుఆఫీసుల్లో పనిచేయకపోతే వారం మొత్తం ఆప్సెంట్ వేస్తామని నోటీసులు జారీ చేసింది. ఇటీవల TCS, Infosys, Wipro వంటి దిగ్గజ ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసునుంచి పనిచేయాలని హెచ్చరించాయి. 

ఫిబ్రవరి 14న HCL టెకీలకు సంస్థ పంపిన ఈమెయిల్స్ ప్రకారం.. డీఎఫ్ ఎస్  ఉద్యోగులు ఆఫీసుల్లో వారికి అప్పగించిన బాధ్యతల్లో వారానికి మూడు రోజులు విధులు నిర్వహించాలని HCL కంపెనీ ప్రతినిధులు  చెపుతున్నారు. కంపెనీ హైబ్రిడ్ వర్క్ మోడల్, బ్లెండింగ్ ఆఫీస్ , రిమోట్ వర్క్ ను అనుసరిస్తుందంటున్నారు. ఏదీ ఏమైనా వారానాకి మూడు రోజులు ఆఫీసులకు హాజరు కావాల్సిందేనని యాజమాన్నం స్పష్టం చేస్తుంది. నిబంధనలు పాటించని వారికి వారం రోజులు ఆప్సెంట్ వేస్తామని  HCL  కంపెనీ ప్రతినిది ఒకరు తెలిపారు.