
సంగారెడ్డి టౌన్ , వెలుగు: ఇంటర్ ఎంపీసీ, ఎంఈసీ పూర్తి చేసిన 2022-–23 బ్యాచ్ స్టూడెంట్లకు హెచ్‌సీఎల్ టెక్‌బీ ఆధ్వర్యంలో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి గోవింద్ రామ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 1న సంగారెడ్డిలోని ఎస్‌వీ జూనియర్ కాలేజీలో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఎంపీసీ, ఎంఈసీలో 75 శాతం ఓవరాల్‌గా, మ్యాథమెటిక్స్‌లో 60 శాతం మార్పులు పొందిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న వారు రిజిస్ట్రేషన్లు పూర్తిచేసుకుని సెలక్షన్ ప్రాసెస్ లో పాల్గొనాల్సిందిగా కోరారు. మరిన్ని వివరాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ http// bit. ly/ HCLTB. Telangana, ఏరియా కోఆర్డినేటర్ రాఘవేంద్ర 9063564875ను సంప్రదించాలని కోరారు.