హెచ్​సీఎల్​ లాభం రూ.4,591 కోట్లు

న్యూఢిల్లీ:  హెచ్​సీఎల్​ టెక్నాలజీస్ గత డిసెంబర్​తో ముగిసిన మూడో క్వార్టర్​ ఫలితాలను సోమవారం ప్రకటించింది.  కంపెనీ కన్సాలిడేటెడ్​ నికర లాభం 5.5 శాతం పెరిగి రూ. 4,591 కోట్లకు చేరుకుంది.  కార్యకలాపాల నుంచి ఆదాయం ఐదు శాతం పెరిగి రూ.29,890 కోట్లకు చేరుకుంది.గత ఏడాది ఇదే కాలంలో రూ.28,446 కోట్లు వచ్చాయి.  కంపెనీ  రూ.18 చొప్పున ఇంటెరిమ్​ డివిడెండ్,  ఆరు రూపాయల చొప్పున ప్రత్యేక డివిడెండ్​​ప్రకటించింది.