- బైపీసీ, సీఈసీ, ఒకేషనల్ స్టూడెంట్స్ కు చాన్స్
- ఏడాది ట్రెయినింగ్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్
- ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.10 వేల స్టైఫండ్
- 27న మంచిర్యాల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జాబ్ మేళా
- హెచ్‌సీఎల్ టెక్బీ, ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో సెలక్షన్స్
మంచిర్యాల, వెలుగు: ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్‌తోనే యువతకు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ జాబ్స్కల్పి స్తోంది. ఇంటర్లో 75 పర్సెంటేజీకి పైగా మార్కులు సాధించిన వారిని మెరిట్ఆధారంగా సెలెక్ట్ చేసుకుని, ఏడాది పాటు ట్రెయినింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఓవైపు జాబ్ చేస్తూనే మరోవైపు ప్రముఖ యూనివర్సిటీల నుంచి డిగ్రీ చేసే అవకాశం కల్పిస్తోంది.
ఈ మేరకు ఇంటర్ బోర్డు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మధ్య గతంలోనే ఎంవోయూ కుదిరింది. బీటెక్ చదవకుండానే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకునే వారికి, ఆర్థిక ఇబ్బందులతో హయ్యర్ స్టడీస్ కొనసాగించలేని వారికి ఇది మంచి చాన్స్. ఉద్యోగంలో నైపుణ్యాలను బట్టి ప్రమోషన్స్ లభించడంతో పాటు శాలరీ హైక్ ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఇంటర్ బోర్డు, హెచ్‌సీఎల్ టెక్బీ ఆధ్వర్యంలో ఈ నెల 27న మంచిర్యాల గవర్నమెంట్ జూనియర్‌కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నారు.
నాన్ మ్యాథ్స్ వారికి చాన్స్
2023, 2024 సంవత్సరాల్లో ఇంటర్ సీఈసీ, బైపీసీతో పాటు వొకేషనల్ కోర్సుల్లో 75శాతం మార్కులు పొందినవారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మూడు దశల్లో అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షించి ఎంపిక చేస్తారు. 27న జరిగే జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదట ఆప్టిట్యూడ్ టెస్ట్, రెండో దశలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టు నిర్వహిస్తారు. ఈ రెండింటిలో సాధించిన మెరిట్ఆధారంగా మూడో దశలో ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
వారికి మధురైలో మూడు నెలలు ట్రైనింగ్, ఆ తర్వాత తొమ్మిది నెలలు చెన్నైలో ఇంటర్న్షిప్ఉంటుంది. ఈ టైమ్‌లో నెలకు రూ.10వేల స్టైఫండ్అందించనున్నారు. ఈ రెండింటిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్చేసిన వారికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో ఏడాదికి రూ.2లక్షల ప్యాకేజీతో ఐటీ అసోసియేట్స్‌గా జాబ్ కల్పిస్తారు.
జాబ్ చేస్తూనే చదువుకోవచ్చు..
అభ్యర్థులు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో ఓవైపు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే మరోవైపు ఉన్నత విద్యను కొనసాగించవచ్చు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీ, ఈఎంఐ నాగ్ పూర్, కేఎల్ యూనివర్సిటీ, ఐఐటీ గౌహతి, ఐఐటీ కొట్టాయం వంటి యూనివర్సిటీల్లో డిగ్రీ చేయవచ్చు. హయ్యర్ స్టడీస్ కోసం ఫీజుల్లో కొంతమొత్తాన్ని సంస్థ భరిస్తుంది. డిగ్రీ కంప్లీట్అయిన తర్వాత అభ్యర్థులు రెండు సంవత్సరాలు తప్పనిసరిగా హెచ్‌సీఎల్‌లో జాబ్ చేయాలి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో కష్టపడితే హెచ్‌సీఎల్‌లోనే హయ్యర్ పొజిషన్లకు చేరుకునే అవకాశం ఉంటుంది.
యువత సద్వినియోగం చేసుకోవాలి
ఈ నెల 27న మంచిర్యాల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నాం. 2023, 2024 విద్యాసంవత్సరాల్లో ఇంటర్సీఈసీ, బైపీసీ, వొకేషనల్ గ్రూప్స్‌లో 75 పర్సెంట్ మార్కులు సాధించినవారు అర్హులు. టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్సులు, ఒక ఫొటో, ఆండ్రాయిడ్ మొబైల్‌తో జాబ్ మేళాకు హాజరుకావాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - అంజయ్య, ఇన్చార్జి డీఐఈవో, మంచిర్యాల
హయ్యర్ పొజిషన్లకు చేరుకోవచ్చు
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ ఇంటర్క్వాలిఫికేషన్తోనే సాఫ్ట్వేర్ జాబ్స్ ఆఫర్ చేస్తోంది. ఓవైపు జాబ్ చేస్తూనే మరోవైపు హయ్యర్ స్టడీస్ కంటిన్యూ చేయవచ్చు. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2వేల మందికిపైగా సెలెక్ట్ చేసుకున్నాం. ఎప్పటికప్పుడు స్కిల్స్ డెవలప్ చేసుకుంటే హయ్యర్ పొజిషన్లకు చేరుకోవచ్చు.
- శ్రీనివాస్, హెచ్‌సీఎల్ టెక్బీ హెచ్ఆర్