ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటైన హెచ్సీఎల్టెక్ కంపెనీ తమ సంస్థలో పనిచేస్తున్న జూనియర్ ఉద్యోగులకు చల్లటి కబురు చెప్పింది. జూనియర్ లెవెల్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్వల్పంగా శాలరీ పెంచనున్నట్లు తెలిసింది. HCL జూనియర్ ఉద్యోగులకు 1 నుంచి 2 శాలరీ హైక్ ఇవ్వనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే.. ఇది సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ఇంక్రిమెంట్తో పోల్చితే చాలా తక్కువే.
HCL కంపెనీలో సంవత్సరానికి యావరేజ్గా 7 శాతం ఇంక్రిమెంట్లు పడుతున్నాయి. పనితీరు మెరుగ్గా ఉన్న ఉద్యోగులకు 12 నుంచి 15 శాతం హైక్ ఇస్తామని ఇప్పటికే HCLTech యాజమాన్యం తెలిపింది. అసలు జీతాలు పెరగకపోవడం కంటే 1 నుంచి 2 శాతం పెరిగినా కొంత ఊరట కలిగించే విషయమేననే అభిప్రాయం HCL జూనియర్ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
Also Read : డిపాజిట్లు16శాతం పెరిగాయ్
ఇక.. ఇతర ఐటీ కంపెనీల్లో హైక్స్ విషయానికొస్తే.. 2025 ఆర్థిక సంవత్సరంలో జీతాల పెంపును టీసీఎస్ జాప్యం చేసింది. దీంతో.. ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాధారణంగా, ఐటి కంపెనీలు ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై) వేతనాల్ని పెంచుతాయి. ఏప్రిల్ 1 నుండి పెరిగిన శాలరీ అమల్లోకి వస్తుంది. అయితే, ఈ ఏడాది దాదాపు మెజారిటీ ఐటీ కంపెనీలు ఆ సమయంలో వేతనాల పెంపును వాయిదా వేశాయి. దీంతో.. వేతనాల పెంపుపై ఐటీ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.