![Job News : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ప్రొఫెసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్](https://static.v6velugu.com/uploads/2025/02/hcu-jobs-notification-released-details-here_VywR97C0Bn.jpg)
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అప్లికేషన్లను కోరుతున్నది. ఈ నెల 20 లోపు అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పోస్టులు (40): కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్, ఏనిమల్ బయాలజీ, న్యూరల్ కగ్నిటివ్సైన్స్, ఫిలాసఫీ, ఉర్దూ, అప్లయిడ్ లింజిస్టిక్స్ అండ్ ట్రాన్స్లేషన్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కమ్యూనికేషన్స్, డాన్స్, థియేటర్ ఆర్ట్స్, మ్యాథ్స్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, బయోకెమిస్ట్రీ, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ALSO READ :BDLలో ఉద్యోగాలు : ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్.. జీతం లక్షల్లో.. టైం లేదు త్వరపడండి..!
ఎలిజిబిలిటీ: వయో పరిమితి 65 ఏండ్లు మించకూడదు. ఆయా విభాగాల్లో పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీ, నెట్, సెట్లో ఉత్తీర్ణతతోపాటు బోధనా అనుభవం ఉండాలి. అప్లికేషన్లను ఆన్ లైన్ ద్వారా పంపించాలి.
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.