హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సి యు)లో అడ్మిషన్ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ ద్వారా రేపటి నుంచి అంటే ఈనెల 21 నుంచ జులై 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష మాత్రం ఆగస్టు లేదా సెప్టెంబర్ లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు హెచ్ సీ యూ ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరంలో రెండు కొత్త కోర్సులను ప్రవేశపెడుతోంది. ఎంటెక్ (మోడలింగ్ అండ్ సైముల్టేషన్), ఎం.పి.ఏ (మ్యూజిక్) సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభిస్తోంది. ప్రవేశ పరీక్ష 39 కేంద్రాల్లో ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ ద్వారా నిర్వహిస్తామని హెచ్ సీయూ చెబుతోంది. హెచ్ సీయూ లో 117 కోర్సులకు గాను 2,328 సీట్లు భర్తీ చేయబోతోంది. ఈ 117 కోర్సులలో 17 ఇంటిగ్రేటెడ్ కోర్సులు, 46 పీజీ కోర్సులు, 10 ఎంటెక్, 44 పీహెచ్ డీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
పూర్తి వివరాలకు వెబ్ సైట్: ‘http://acad.uohyd.ac.in’.