కేంద్రమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం(జూలై28,2024) బెంగళూరులో బీజేపీ నేతలతో సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడు తుండగా ముక్కు నుంచి రక్తం రావడంతో జయనగర్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం బాగానే ఉన్నారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపారు.
ముక్కు రక్త స్రావం అతని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తీసుకున్న మందుల కారణంగా వచ్చిందని తెలిపారు. భారత మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు అయిన హెచ్ డీ కుమార స్వామి రేపు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మార్చిలో, కుమారస్వామి చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో ట్రాన్స్‌కాథెటర్ అయోర్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టిఎవిఐ) చేయించుకున్నారు.