న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్లో భారీగా డిపాజిట్లను, లోన్లను సాధించింది. దేశీయ రిటైల్ లోన్లు 2021 డిసెంబర్ 31 నాటికి దాదాపు 21.5శాతం, 2022 సెప్టెంబర్ 30 నాటికి దాదాపు 5.0శాతం పెరిగాయి. వాణిజ్య & గ్రామీణ బ్యాంకింగ్ లోన్లు 2021 డిసెంబర్ 31 నాటికి దాదాపు 30 శాతం, 2022 సెప్టెంబర్ 30 నాటికి దాదాపు 5.0శాతం పెరిగాయి. కార్పొరేట్ & ఇతర హోల్‌సేల్ లోన్లు 2021 డిసెంబర్ 31 కంటే దాదాపు 20 శాతం పెరిగాయి. ఇవి 2022 సెప్టెంబర్ 30 కంటే దాదాపు 1.0శాతం తగ్గాయని బ్యాంక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. బ్యాంక్ డిపాజిట్లు 2021 డిసెంబర్ 31 నాటికి రూ.14,459 బిలియన్లతో పోలిస్తే 2022 డిసెంబర్ 31 నాటికి దాదాపు 19.9శాతం (వార్షికంగా) రూ.17,335 బిలియన్లకు పెరిగాయి. డిపాజిట్లు కిందటి సెప్టెంబర్ 30 నాటికి మూడు శాతం పెరిగి రూ.16,734 బిలియన్లకు చేరాయి. రిటైల్ డిపాజిట్లు దాదాపు రూ.670 బిలియన్లు పెరిగాయి. ఇవి 2021 డిసెంబర్ 31 కంటే దాదాపు 21.5శాతం, 2022 సెప్టెంబర్ 30 కంటే దాదాపు 5 శాతం పెరిగాయి. టోకు డిపాజిట్లు 2021 డిసెంబర్ 31 కంటే దాదాపు 11.5శాతం పెరిగాయి, 2022 సెప్టెంబర్ 30 కంటే దాదాపు 2.5శాతం తగ్గాయని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ కాసా నిష్పత్తి డిసెంబర్ 31, 2022 నాటికి 44శాతం, 2021 డిసెంబర్ 31 నాటికి 47.1శాతం, 2022 సెప్టెంబర్ 30 నాటికి 45.4శాతం ఉంది. డిపాజిట్లు 2022 డిసెంబర్ 31 నాటికి సుమారు రూ. 7,630 బిలియన్లకు చేరాయి. 2021 డిసెంబర్ 31 నాటికి రూ. 6,812 బిలియన్లుగా ఉన్నాయి. అంటే దాదాపు 12.0శాతం గ్రోత్ కనిపించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 7,597 బిలియన్లకు చేరాయి. బ్యాంక్ హెచ్డీఎఫ్సీ నుండి రూ.88.92 బిలియన్ల విలువైన లోన్లను కొనుగోలు చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన పేరెంట్కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీతో విలీనం అవుతామని ప్రకటించింది.
పెరిగిన హెచ్డీఎఫ్సీ డిపాజిట్లు
- బిజినెస్
- January 5, 2023
మరిన్ని వార్తలు
-
దుమ్మురేపిన బుల్స్ సెన్సెక్స్..1,436 పాయింట్లు జంప్
-
Post Office Savings Schemes: పోస్టాఫీస్సేవింగ్స్ స్కీంల వడ్డీ రేట్లు మారాయా?..ఫుల్ డిటెయిల్స్ ఇవిగో
-
2024లో కార్లు పెద్దగా కొనలేదంట.. 2025లో కొనే ఆలోచనలో ఉన్నారా..? అయితే ఇది తెలుసుకోండి ఫస్ట్..
-
కొత్త కారు ప్లానింగ్ లో ఉన్నారా.. ఈ ఏడాది రిలీజ్ అయ్యే న్యూ మోడల్స్ ఇవే..!
లేటెస్ట్
- మల్లారెడ్డి కాలేజీ దగ్గర హైటెన్షన్
- ప్రేమించాడు.. బోర్డర్ దాటాడు... పాక్ పోలీసులకు చిక్కాడు..
- భద్రాచలంలో .. వరాహరూపంలో భద్రాద్రి రామయ్య
- ఎఫ్టీఎల్ నిర్ధారణపై పూర్తి వివరాలివ్వండి..రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- 6జీ రేసులో చైనా దూకుడు
- తెలంగాణలోని 17 వేల స్కూళ్లలోనే ఇంటర్నెట్..
- ఎన్సీడీ క్లినిక్‌లకు పేషెంట్ల వివరాలు లింక్ చేయండి : హెల్త్ మినిస్టర్
- మహబూబ్‌నగర్‌కు విద్యా నిధి
- లేగ దూడకు బారసాల
- భద్రాద్రి, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి
Most Read News
- Gold Rates: జనవరి 2న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి
- తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
- FD Rules 2025: ఫిక్స్డ్ డిపాజిట్లపై కొత్త రూల్స్..డిపాజిటర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- ఏపీ రైతులకు పండగ.. అకౌంట్ లో రూ. 20 వేలు వేస్తామని మంత్రి ప్రకటన
- ఈ వాచ్ రూ.22 కోట్లు.. భూ మండలంపై మూడు మాత్రమే.. ఒకటి అంబానీ దగ్గర
- 2025లో ఈ బిజినెస్ ఏదో బాగుందే.. 2 లక్షల పెట్టుబడి.. లాభాలే లాభాలు.. డబ్బులే డబ్బులు..!
- మందు తాగితే వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా..
- రూ.450 కోట్ల కుంభకోణంలో.. క్రికెటర్లకు సీఐడీ సమన్లు.. లిస్టులో శుభ్‌మన్ గిల్
- Beauty Tips : కాలి మడమలు ఎందుకు పగుల్తాయ్.. అనారోగ్యాన్ని సూచిస్తుందా.. ట్రీట్ మెంట్ ఏంటీ..?
- తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: 14 నుంచి రైతు భరోసా డబ్బులు జమ