HDFC అకౌంట్స్‌‌లో కోట్లాది రూపాయలు

HDFC  అకౌంట్స్‌‌లో  కోట్లాది రూపాయలు

మీకు హెచ్‌‌డీఎఫ్‌‌సీ (HDFC) ఖాతా ఉంటే.. ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే..కొందరి అకౌంట్లలో కోట్లాది రూపాయలు జమ అయ్యాయి. ఇటీవల వికారాబాద్ లోని ఓ హెచ్ డీఎఫ్ సీ అకౌంట్ లో రూ. 18 కోట్లు జమవ్వడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.. లేటెస్ట్ గా చెన్నైలోని  HDFC బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలో భారీగా డబ్బులు జమ కావడం కలకలం రేపింది. చెన్నైలోని టి.నగర్​ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాదారులు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. తమ మొబైల్​ ఫోన్​లకు వచ్చిన మెసేజ్​లు చూసి అవాక్కయ్యారు. ఒక్కొక్కరి అకౌంట్‌లో టి.నగర్‌ బ్రాంచ్‌ అధికారులు రూ. 13కోట్లు జమ చేశారు. కొంతమంది ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలియజేయడంతో వారి ఖాతాలను సీజ్‌ చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక లోపం వల్ల బదిలీ జరిగిందా?  బ్యాంకు సర్వర్‌ హ్యాక్‌కు గురైందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలోని వికారాబాద్ లో  వెంకట్ రెడ్డి అనే వ్యక్తి మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతనికి HDFC వికారాబాద్ బ్రాంచ్ లో ఖాతా ఉంది. ఇతని ఖాతాలో ఒక్కసారిగా రూ. 18 కోట్ల 52 లక్షల రూపాయలు జమ అయ్యాయి. అసలు ఇలా ఎలా జరిగిందో అని అతను ఆశ్యర్యానికి గురయ్యాడు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపాడు. బ్యాంకు అధికారులు అకౌంట్లను సీజ్ చేయడంతో ఖాతాదారులు పలు సమస్యలను  ఎదుర్కొన్నామని, రోజంతా తమ సొంత డబ్బులను ఉపయోగించుకోలేకపోయామని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు అలర్ట్ అయ్యారు. టెక్నికల్ సమస్యతోనే ఇలా జరిగిందని, కొత్త సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసే క్రమంలో ఇలా జరిగిందని అధికారులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. డబ్బులు జమ అయిన అకౌంట్లను గుర్తించారు. డబ్బులను రికవరీ చేసే పనిలో పడ్డారు. అయితే కొంతమంది ఖాతాదారులు డబ్బులను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం : -

కాంగ్రెస్ పై నగ్మా అసంతృప్తి


పుణె డిఫెన్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్