- ఏయూ, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కూడా..
- 9.50 % వరకు పెంచుకునేందుకు ఆర్‌బీఐ అనుమతి
- ఇప్పటికే 5 శాతానికి పైగా వీటిలో వాటాలు
న్యూఢిల్లీ: కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో గరిష్టంగా 9.50 శాతం వరకు వాటాలను పెంచుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇతర హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అనుమతులు ఇచ్చింది. ఈ బ్యాంకుల పెయిడప్ క్యాపిటల్ లేదా ఓటింగ్ రైట్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ మేనేజ్‌మెంట్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌లు కలిసి 9.50 శాతం వరకు వాటాలను కొనుగోలు చేయడానికి వీలు కుదిరింది. రానున్న ఏడాదిలోపు ఈ వాటాల కొనుగోలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
అంటే వచ్చే ఏడాది జనవరి 2 లోపు కొనుగోళ్లు పూర్తి కాకపోతే ఆర్‌బీఐ నుంచి మళ్లీ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కోటక్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుకోవడం లేదు. అయినప్పటికీ ఈ బ్యాంకుల్లోని హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ కంపెనీల వాటాలు 5 శాతాన్ని దాటుతున్నాయి. దీంతో వాటాలను పెంచుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా ఆర్‌బీఐ అనుమతులు తీసుకుంది.
పెరగనున్న హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ బ్రాంచ్‌లు
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ (ఏఎంసీ) భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో 25 కొత్త బ్రాంచ్‌లను ఓపెన్ చేయాలని చూస్తోంది. మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతుండడంతో బిజినెస్‌ను విస్తారించాలని నిర్ణయించుకుంది. ఖమ్మం, విజయనగరం, భరత్‌పూర్, భుసావల్, వరచా, బోపాల్, వాకాడ్, చిత్తోడ్‌గఢ్, జల్నా, అజంగఢ్, పూర్నియా, సీతాపూర్, బస్తీ, అర్రా, బద్లాపూర్, కాశీపూర్, ఫిరోజ్‌పూర్, బరాసత్, బెర్హంపూర్(ముర్షిదాబాద్), బోల్‌పూర్, కొల్లం, హోసూరు, హసన్, నాగర్‌కోయిల్, తంజావూరు వంటి టైర్ 2 సిటీలలో కొత్త బ్రాంచ్‌లను కంపెనీ ఓపెన్ చేయనుంది.
ALSO READ : ఏథర్ ఎలక్ట్రిక్ బైక్ కొత్త మోడల్స్..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే..161 కి.మీలు ప్రయాణించొచ్చు
దీంతో కంపెనీ మొత్తం బ్రాంచులు 250కి చేరుకుంటాయి. ‘ప్రతి భారతీయుడికి సంపద పెంచుకోవడంలో సాయపడడమే మా లక్ష్యం. దేశవ్యాప్తంగా 25 కొత్త శాఖలను ఏర్పాటు చేస్తుండడమే ఇందుకు నిదర్శనం . అన్ని రకాల పెట్టుబడి అవకాశాలను ఇన్వెస్టర్లకు అందిస్తాం’ అని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ సీఈఓ నవనీత్ మునోత్ అన్నారు.