హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ లోన్లపై వడ్డీ పెంపు

హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ లోన్లపై వడ్డీ పెంపు

న్యూఢిల్లీ:  లోన్లపై వేసే వడ్డీ   రేటును  హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ పెంచింది. బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ రేట్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ను 5 బేసిస్ పాయింట్లు (0.05 శాతం) పెంచింది. ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటే బ్యాంకులు వేసే కనీస వడ్డీ రేటు. ఏడాది కాల పరిమితి ఉండే ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ 9.45 శాతం దగ్గరే కొనసాగుతుంది. దీనిని మార్చలేదు.

సాధారణంగా వెహికల్‌‌‌‌‌‌‌‌, పర్సనల్ లోన్లపై ఈ ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేస్తారు. కానీ, ఒక రాత్రి కాలపరిమితి గల  ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 9.10 శాతం నుంచి 9.15 శాతానికి, ఒక నెల ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 9.20 శాతానికి  బ్యాంక్ పెంచింది.