
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మంగళవారం దాదాపు 2 శాతం పెరగడంతో మార్కెట్ విలువ (ఎంక్యాప్) రూ. 15 లక్షల కోట్ల మార్కును దాటింది. ఈ మైలురాయిని సాధించిన మూడో ఇండియన్ కంపెనీగా అవతరించింది. బీఎస్ఈలో ఈ షేరు 1.78 శాతం పెరిగి రూ.1,961.90 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 2.23 శాతం పెరిగి రూ.1,970.65కి చేరుకుంది. - ఇది రికార్డు స్థాయి. ఎన్ఎస్ఈలో షేరు 1.70 శాతం పెరిగి రూ.1,960కి చేరుకుంది.
ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు 11.12 శాతం పెరగడంతో మార్కెట్క్యాప్ రూ.1,50,289.64 కోట్లు పెరిగి రూ.15,01,289.37 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు, రిలయన్స్ , టీసీఎస్ మాత్రమే రూ.15 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించాయి. హెచ్డీఎఫ్సీ ఈ క్వార్టర్లో రూ.17,616 కోట్ల నికర లాభం సంపాదించింది.