న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బంధన్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంకుల్లో 9.5 శాతం వరకు వాటాను హోల్డ్ చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రూప్‌కు ఆర్‌బీఐ అనుమతులు ఇచ్చింది. ఏడాది వరకు అనుమతులకు వ్యాలిడిటీ ఉంటుంది. పైన పేర్కొన్న ఆరు బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయాలని ఉందని, కానీ వాటా 5 శాతం దాటుతుందని ఆర్‌బీఐకి పెట్టుకున్న అప్లికేషన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేర్కొంది.
ఈ ఆరు బ్యాంకుల్లోని పెయిడప్ షేర్ క్యాపిటల్ లేదా వోటింగ్ రైట్స్‌లో 9.5 శాతం వరకు వాటా హోల్డ్ చేయడానికి అనుమతులు వచ్చాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్ గ్రూప్ కింద హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, ఇతర కంపెనీలు ఉన్నాయి.
ALSO READ: నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!