HDFC Credit Cards Rules : క్రెడిట్ కార్డుల ద్వారా రెంట్స్  చెల్లిస్తున్నారా..ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ 

HDFC Credit Cards Rules : క్రెడిట్ కార్డుల ద్వారా రెంట్స్  చెల్లిస్తున్నారా..ఆగస్టు 1 నుంచి కొత్త రూల్స్ 

HDFC Credit Cards Rules: దేశంలో అతిపెద్ద  ప్రైవేట్ బ్యాంకు అయిన HDFC తన క్రెడిట్ కార్డు హోల్డర్లకోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనలు ఆగస్టు 1, 2024 నుంచి అమలు లోకి వస్తాయి. HDFC కంటే ముందే ఐసీఐసీఐ, ఎస్ బీఐ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ ఆప్షన్లలో రెంట్ చెల్లింపుపై రివార్డ్ పాయింట్లను నిలిపివేశాయి. అయితే ఇప్పుడు HDFC బ్యాంకు క్రెడిట్ చెల్లింపుల అదనపు ఫీజును పెంచింది.

రెంట్లపై 1 శాతం ఫీజు పెంపు 

Paytm, CRED, Mobikwik, Cheq వంటి థర్డ్ పార్టీ చెల్లింపు యాప్ ల ద్వారా చేసే రెంట్ పేమెంట్ లావాదేవీలపై 1శాతం ఫీజును వసూలు చేయనుంది. చెల్లింపులు ఒక ఒక్కో లావాదేవీలపై రూ.3 వేల వరకు పరిమితం చేయబడ్డాయి. 

 యూటిలిటీ ట్రాన్సాక్షన్స్ పై 1శాతం 

రూ. 50వే ల వరకు లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. రూ. 50 వేల కంటే ఎక్కువ లావాదేవీలపై 1 శాతం ఛార్జీలు పడతాయి. ప్రతి లావాదేవీకి రూ. 3వేల పరిమితి ఉంది. ఇన్సూరెన్స్ లావాదేవీలపై మాత్రం అదనపు ఛార్జీలు లేవు. 

పెట్రోల్ పై పేమెంట్లపై 1 శాతం 

పెట్రోల్, డీజిల్  పేమెంట్లు రూ.15 వేల కంటే తక్కువ ఉంటే ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. రూ. 15 కంటే ఎక్కువ ఉంటే మొత్తంపై 1 శాతం ఛార్జీలు వసూలు చేయనున్నారు.

ఎడ్యుకేషనల్ (కాలేజీ, స్కూల్ ఫీజులపై) లావాదేవీలు

కాలేజీ, స్కూల్ ఫీజులు కళాశాల, పాఠశాల వెబ్ సైట్ లు , వాటి POS మెషీన్ల ద్వారా నేరుగా చేసే లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ CRED, PayTM వంటి థర్డ్ పార్టీ లావాదేవాలపై 1 శాతం చెల్సించాల్సి ఉంటుంది. 

అంతర్జాతీయ లావాదేవీలపై 3.5 శాతం ఛార్జీ 

అన్ని రకాల ఇంటర్నేషనల్ పేమెంట్స్ పై 3.5 శాతం మార్కప్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

EMI ప్రాసెసింగ్ ఫీజు 

ఏదేనీ ఆన్ లైన్ , ఆఫ్ లైన్ స్టోర్ లో సులభమైన EMI ఎంచుకుంటే కస్టమర్లు రూ. 299 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.